News October 23, 2024

జమిలీ ఎన్నికలతో చాలా ప్రమాదం: బీవీ రాఘవులు

image

TG: జమిలీ ఎన్నికలతో దేశానికి చాలా ప్రమాదమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు తగ్గుతుందన్న కేంద్రం మాటలు బూటకమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసే హక్కు మోదీకి లేదని మండిపడ్డారు. జమిలీ ఎన్నికల తర్వాత అధ్యక్ష తరహా పాలన వస్తుందని అన్నారు.

Similar News

News October 23, 2024

భూముల రీ-సర్వే.. గ్రామసభల్లో 41వేల ఫిర్యాదులు

image

AP: భూములపై రీ-సర్వే నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ఇప్పటి వరకు 41,112 ఫిర్యాదులు అందాయి. భూ విస్తీర్ణాల తగ్గింపు, పత్రాల్లో తప్పులు, చనిపోయిన వారి పేర్ల ముద్రింపు వంటి సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. గత ప్రభుత్వం రీ-సర్వే చేసి 6,860 గ్రామాల్లో 21లక్షల హక్కు పత్రాలు పంపిణీ చేసింది. ఇందులో 25-30% మేర తప్పులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటిని సరిదిద్దేందుకు సమయం పడుతుందని మంత్రి అనగాని తెలిపారు.

News October 23, 2024

మోసపూరిత ప్రకటనల కట్టడికి Facebook, Instagramలో కొత్త ఫీచర్

image

సెల‌బ్రిటీల చిత్రాల డీప్ ఫేక్ ద్వారా వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల రూపంలో జ‌రుగుతున్న మోసాల క‌ట్ట‌డికి మెటా చ‌ర్య‌లు ప్రారంభించింది. Facebook, Instagramలో ఫేషియ‌ల్ రిక‌గ్నీష‌న్ టెక్నాల‌జీని ప్రయోగాత్మకంగా ప‌రీక్షించింది. సెల‌బ్రిటీలు మాట్లాడుతున్న‌ట్టుగానే ప్రక‌ట‌న‌ల రూపంలో ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న‌ సెలెబ్ బైట్ స్కాంల‌ కట్టడే ఈ కొత్త ఫీచ‌ర్ ల‌క్ష్యం. త్వరలో దీన్ని యాడ్ రివ్యూ సిస్టంలో ప్రవేశపెట్టనుంది.

News October 23, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై చర్చించే అవకాశముంది. 13కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.