News October 23, 2024

గంజాయి కాల్చేందుకు స్టేషన్‌కే వెళ్లారు!

image

వారందరూ మైనర్లు, విద్యార్థులు. కేరళలోని త్రిస్సూర్ నుంచి మున్నార్ వరకూ టూర్ వెళ్తున్నారు. దారిలో భోజనం కోసం బస్సు ఆగినప్పుడు ఇద్దరు కుర్రాళ్లు గంజాయి బీడీల్ని తాగాలనుకున్నారు. అగ్గిపెట్టె లేకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లి అడిగారు. తీరా చూస్తే అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Similar News

News October 23, 2024

రూ.1,000 కోట్ల పెట్టుబడులు.. 12,500 మందికి ఉపాధి: ప్రభుత్వం

image

AP: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డ్రోన్ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించింది. దీనిపై కూటమి పార్టీలు, నిపుణుల సూచనలు తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామంది. నవంబర్ వరకు ఫైనల్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది.

News October 23, 2024

2 రోజుల్లోనే ఖాతాల్లోకి గ్యాస్ డబ్బులు: TDP

image

AP: దీపావళి నుంచి ప్రారంభించే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై TDP కీలక ప్రకటన చేసింది. ‘ఏటా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ మొదలవుతుంది. 31 నుంచి సరఫరా చేస్తారు. ఒక్కో సిలిండర్‌పై రూ.851 రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. 2 రోజుల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది’ అని ఓ ఫొటోను పంచుకుంది. అటు ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది.

News October 23, 2024

ఒంటరితనం యమా డేంజర్

image

ఒంటరితనంతో ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బాధపడుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువత సైతం దీని బారిన పడుతున్నారు. అయితే ఇలా సామాజిక సంబంధాలు సరిగా లేక అసంతృప్తితో బతికేవారు డిమెన్షియా బారిన పడే అవకాశం 30% పెరిగిందని పరిశోధనలో తేలింది. 6 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. డిమెన్షియాతో వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రభావితం అవుతాయని తెలిపారు.