News October 23, 2024

మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు

image

AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజెన్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనుంది. జిల్లాల వారీగా మెనూని తీసుకురావాలా? లేదా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మెనూని అమలు చేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.

Similar News

News March 16, 2025

బంగారం ధర తగ్గే అవకాశం ఉందా?

image

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు తగ్గుతాయనే విషయమై నిపుణులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ అనూహ్య నిర్ణయాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే తగ్గకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం 3వేల డాలర్లు ఉన్న ఔన్సు ధర 3,040 డాలర్లకు చేరాక అక్కడి నుంచి తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై 1-2 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

News March 16, 2025

కోహ్లీ.. ఆ ఒక్క సెంచరీ చేస్తే

image

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ఐపీఎల్‌లో మరో సెంచరీ చేస్తే టీ20 ఫార్మాట్‌లో 10 శతకాలు చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలవనున్నారు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. కోహ్లీ IPLలోనే 8 సెంచరీలు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సెంచరీ చేశారు. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో గేల్(22), బాబర్(11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

News March 16, 2025

గ్రూప్-1 ఫలితాల్లో వారికి అన్యాయం: కవిత

image

TG: గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలను ప్రభుత్వంతో పాటు TGPSC నివృత్తి చేయాలని BRS ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించారు. పేపర్ వాల్యూయేషన్‌లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. గ్రూప్-2 ఫలితాల్లో 13వేల మందిని ఇన్వాలిడ్‌గా ఎలా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

error: Content is protected !!