News October 23, 2024

ఒంగోలు: మహిళల ఎదుగుదలకు రుణాలు

image

మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా ప్రకాశం జిల్లాలోని 837 స్వయం సహాయక సంఘాలకు రూ.100 రోట్ల రుణాలు మంజూరైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. మంగళవారం ఒంగులులో నిర్వహించిన డీఆర్డీఏ, కెనరా బ్యాంకు అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25న ఒంగోలులో ని ఏ-1 హాల్లో రుణాలు అందిస్తామన్నారు. మహిళలకు చేయూతనందించి వారి ఉన్నతికి తోడ్పడాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు.

Similar News

News November 24, 2024

పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్

image

పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా బోధనతో పాటు పారిశుధ్యం పైన కూడా దృష్టి సాధించాలన్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లిష్, గణితంలో పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు.

News November 24, 2024

IPL వేలంలో మన ప్రకాశం కుర్రాడు.!

image

IPL మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన మనీశ్ రెడ్డి రూ.30 లక్షల బేస్ ఫ్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన ప్రకాశం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 24, 2024

సంతనూతలపాడు ZPHSలో కలెక్టర్ తనిఖీలు

image

సంతనూతలపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లల్లో అభ్యాస శక్తిని పెంపొందించాలని సూచించారు.