News October 23, 2024
అంబాజీపేట: కన్నీరు పెట్టిస్తున్న దంపతుల సూసైడ్ నోట్

అంబాజీపేటకు చెందిన రామసుబ్రహ్మణ్యం, నాగమణి దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ‘ఇంతవరకు మాకు చేసిన సేవలు చాలు, మీరైనా సుఖపడండి’అని లేఖలో పేర్కొన్నారు. పదేళ్ల క్రితం కొడుకు వెంకటకిరణ్, కోడలు లక్ష్మీశ్వేత, మనవరాలు, మనవడు రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వీరిని మనోవేదనకు గురిచేసింది. ప్రస్తుతం వీరి వద్ద చిన్న కుమార్తె సునీత తన బిడ్డతో ఉండగా.. ఆమె విశాఖలో ఓ వేడుకకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది.
Similar News
News January 19, 2026
రాజమండ్రిలో ప్రయాణికుల కష్టాలు.. స్పందించిన మంత్రి

రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు లేక <<18899041>>ప్రయాణికులు <<>>పడుతున్న ఇబ్బందులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తక్షణమే స్పందించారు. జిల్లా ప్రజా రవాణా అధికారితో మాట్లాడి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని అధికారులు ఆయనకు వివరించారు.
News January 19, 2026
తూ.గో: ‘పంచాయతీ, రెవెన్యూ శాఖలకే అధిక వినతులు’

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు మొత్తం 147 అర్జీలు వచ్చాయి. కలెక్టర్, జేసీ వై.మేఘా స్వరూప్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ విభాగానికి(రెవెన్యూ క్లినిక్) 62, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధికి 59, హోంశాఖకు 9, వైద్యారోగ్య శాఖకు 17 దరఖాస్తులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు.
News January 19, 2026
తూ.గో: నేడు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్

జనవరి 19న కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్, PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నామన్నారు. భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.


