News October 23, 2024

ఒంటరితనం యమా డేంజర్

image

ఒంటరితనంతో ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బాధపడుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువత సైతం దీని బారిన పడుతున్నారు. అయితే ఇలా సామాజిక సంబంధాలు సరిగా లేక అసంతృప్తితో బతికేవారు డిమెన్షియా బారిన పడే అవకాశం 30% పెరిగిందని పరిశోధనలో తేలింది. 6 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. డిమెన్షియాతో వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రభావితం అవుతాయని తెలిపారు.

Similar News

News October 23, 2024

రెబల్ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

రెబల్ స్టార్ ప్రభాస్‌కి హీరో రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. తన బెస్ట్ ఫ్రెండ్‌కు హీరో గోపీచంద్ విషెస్ తెలిపారు. ‘ఇండియాలో బిగ్ స్టార్లలో ఒకరిగా ఉంటూ నిరాడంబరంగా ఉండటం నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది’ అని పేర్కొన్నారు. వీరితోపాటు అర్జున్ దాస్, శ్రీవిష్ణు, శర్వానంద్, ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి, మెహర్ విషెస్ తెలిపారు.

News October 23, 2024

హెజ్బొల్లాకు మరో షాక్

image

హెజ్బొల్లా గ్రూప్‌కు వారసుడిగా భావిస్తున్న నస్రల్లా బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ దళాలు హతమార్చినట్లు IDF ప్రకటించింది. 3వారాల క్రితం లెబనాన్ దహియాలోని ఓ బంకర్‌లో సమావేశంలో ఉండగా జరిపిన దాడిలో అతడు చనిపోయాడంది. అతడితో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీహుస్సేన్ హజిమా, పలువురు కమాండర్లు మృతిచెందారంది. అటు తదుపరి హెజ్బొల్లా పగ్గాలు ఎవరు అందుకుంటారనేది ఆసక్తిగా మారింది.

News October 23, 2024

పేకాట క్లబ్ యాజమాన్యాలకు హైకోర్టు చురకలు

image

AP: రమ్మీ ఆట విషయంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. కొంతకాలం పేకాట ఆడకపోతే ఆకాశమేమీ కిందపడిపోదని వ్యాఖ్యానించింది. కనీసం ఈ సమయంలోనైనా కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అభిప్రాయపడింది. నిజాలు తెలుసుకోకుండా ఉత్తర్వులిస్తే పేకాటను కోర్టులు ప్రోత్సహిస్తున్నాయనే భావన ప్రజల్లోకి వెళుతుందని పేర్కొంది.