News October 23, 2024
ప్రకాశం జిల్లాలో రూ. లక్షలలో పలుకుతున్న పందెం కోళ్లు

సంక్రాంతి రానున్న నేపథ్యంలో నాటుకోడి, కోడిపుంజులకు భలే గిరాకీ ఉంటోందని కోళ్ల పెంపకం రైతులు అంటున్నారు. ముఖ్యంగా మన జిల్లాలోని మర్రిపూడి, కొండపి ప్రాంతాల్లో రైతులు కోళ్లను పెంచి రూ. లక్షలలో ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి పందెం కోడిపుంజు రూ. లక్షలు పలుకుతాయని, ప్రస్తుతం నాటు కోడి మాంసం రూ. 750 దాకా అమ్ముతున్నట్లు తెలిపారు.
Similar News
News January 9, 2026
ప్రకాశం: 11వ తేదీలోగా పాస్ పుస్తకాల పంపిణీ

ప్రకాశం జిల్లాలో ఈనెల 11వ తేదీలోగా పట్టాదారు పాసుపుస్తకాలన్నీ పంపిణీ చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ పరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అర్జీల స్థితిగతులను ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లాలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
News January 9, 2026
ప్రకాశం: సంక్రాంతికి వస్తున్నారా.. గుడ్ న్యూస్!

సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలో 350 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు 150, బెంగళూరుకు 30, చెన్నైకి 20, విజయవాడకు 150 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. 13వ తేదీ వరకు నడిపే ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూళ్లు చేస్తామని చెప్పారు.
News January 9, 2026
ప్రకాశం కలెక్టర్ సంచలన కామెంట్స్.!

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మరోమారు రెవిన్యూ అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు సంబంధించి అమాయకులైన ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తే ఊరుకోనంటూ కలెక్టర్ హెచ్చరించారు. అలాగే తమ అధికారాలను సక్రమంగా వినియోగించాలని, పద్ధతి పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.


