News October 23, 2024

విశాఖకు 724 కి.మీ. దూరంలో ‘దానా’

image

విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 724 కి.మీ. దూరంలో ‘దానా’ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది క్రమేపి ఒడిశా వైపు కదులుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News July 7, 2025

విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

image

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.

News July 7, 2025

విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

image

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.

News July 6, 2025

విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

image

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.