News October 23, 2024

షమీకి సరైన రిప్లేస్‌మెంట్ మయాంక్: బ్రెట్‌లీ

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మహ్మద్ షమీ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో మయాంక్ యాదవ్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ సూచించారు. ‘150kmph+ వేగంతో వేసే బౌలర్‌ను ఏ బ్యాటర్ ఎదుర్కోలేరు. IPLలో యంగ్ బౌలర్లను దగ్గరుండి చూశా. మయాంక్ తన మొదటి IPLలోనే 157kmph వేగంతో వేశాడు. 135-140kmphతో వచ్చే బంతులు ఓకే కానీ 150kmph వేగాన్ని బ్యాటర్ ఫేస్ చేయలేడు. షమీకి సరైన రిప్లేస్‌మెంట్ మయాంకే’ అని అభిప్రాయపడ్డారు.

Similar News

News October 23, 2024

వయనాడ్: ప్రియాంకా గాంధీని ఢీకొంటున్న ‘యాక్సిడెంటల్ పొలిటీషియన్’

image

ప్రియాంకా గాంధీతో తలపడుతున్న BJP అభ్యర్థి నవ్యా హరిదాస్‌ది కోజికోడ్. వీరి కుటుంబానికి సంఘ్‌తో అనుబంధం ఉంది. 2009లో పెళ్లయ్యాక సింగపూర్‌కు వెళ్లిన నవ్య సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశారు. 2015లో కోజికోడ్ ట్రిప్‌కు వచ్చి లోకల్‌బాడీ ఎలక్షన్లో పోటీ చేశారు. ఓడితే సింగపూర్ వెళ్దామనుకున్న ఆమె వరుసగా 2 సార్లు గెలిచి పార్టీలో ఎదిగారు. 2021లో కోజికోడ్ సౌత్ నుంచి MLAగా ఓడినా BJP ఓట్ల శాతం17-21కి పెంచారు.

News October 23, 2024

భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా APలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంట గంటకు 80-90KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలంది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.

News October 23, 2024

చోటా రాజన్‌కు బెయిల్.. కానీ జైలులోనే!

image

అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2001లో ఓ హోటల్ వ్యాపారిని హత్య చేసిన కేసులో అతడిని దోషిగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది. తాజాగా దాన్ని ఎత్తివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో బెయిల్ వచ్చినా అతడు జైలులోనే ఉండనున్నాడు. 2011లో ఓ జర్నలిస్టును హతమార్చిన కేసులోనూ అతడికి జీవిత ఖైదు పడింది.