News October 23, 2024
BREAKING: బంగాళాఖాతంలో తుఫాన్

తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుఫాన్‌గా మారింది. ఇది రేపటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. ప్రస్తుతం గంటకు 18కి.మీ వేగంతో ఇది కదులుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ సైక్లోన్‌కు ‘దానా’గా నామకరణం చేశారు. విశాఖ తూర్పు ఆగ్నేయ దిశగా 724కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Similar News
News January 25, 2026
భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.
News January 25, 2026
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఈ జాగ్రత్తలు

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్లోరిన్ కలిపిన నీటిలో స్విమ్ చేసే ముందు మంచినీళ్లతో తలస్నానం చేసి క్యాప్ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ తర్వాత మంచి నీళ్లతో తలస్నానం చేయాలి. ఎండలోకి వెళ్లే ప్రతిసారీ సన్‌స్ర్కీన్ హెయిర్ స్ర్పే వాడాలి. తలకు మరీ వేడి/ చల్లని గాలి తరచూ తగలకుండా స్కార్ఫ్/ క్యాప్ పెట్టుకోవాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News January 25, 2026
ఇవాళ నాన్ వెజ్ తినకండి! ఎందుకంటే..

వారంలో కొన్ని రోజులు కొందరు దేవుళ్ల పేరిట నియమాలు పాటించి సండే ఏ రూల్ పెట్టుకోం. కానీ లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడి రోజైన ఆదివారం మాంసం జోలికి పోకూడదట. సూర్యాష్టక శ్లోకం ‘స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే| న వ్యాధి శోక దారిద్య్రం సూర్యలోక స గచ్ఛతి’ ప్రకారం.. ఆదివారం స్త్రీ సాంగత్యం, తల నూనె, మద్యం, మాంసం తాకలేదంటే దారిద్ర్య విముక్తి, సూర్యలోక ప్రాప్తి. ఈరోజు సూర్య జయంతి-రథ సప్తమి.


