News October 23, 2024
STOCK MARKETS: ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా!

బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న బలమైన షేర్లను ఇన్వెస్టర్లు కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 80,381 (+158), నిఫ్టీ 24,521 (+49) వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా లేదా చూడాల్సి ఉంది. రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఐటీ, ఫైనాన్స్, మెటల్ షేర్లు పుంజుకున్నాయి.
Similar News
News January 20, 2026
ఒకే రోజు రూ.22వేలు పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే <<18903989>>కేజీ<<>> వెండిపై రూ.22వేలు పెరిగి రూ.3,40,000కు చేరింది. కేవలం 10 రోజుల్లోనే వెండి ధర రూ.65వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలనిచ్చింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,130 పెరిగి రూ.1,48,370, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,950 ఎగబాకి రూ.1,36,000 పలుకుతోంది.
News January 20, 2026
షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News January 20, 2026
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


