News October 23, 2024

హెజ్బొల్లాకు మరో షాక్

image

హెజ్బొల్లా గ్రూప్‌కు వారసుడిగా భావిస్తున్న నస్రల్లా బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ దళాలు హతమార్చినట్లు IDF ప్రకటించింది. 3వారాల క్రితం లెబనాన్ దహియాలోని ఓ బంకర్‌లో సమావేశంలో ఉండగా జరిపిన దాడిలో అతడు చనిపోయాడంది. అతడితో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీహుస్సేన్ హజిమా, పలువురు కమాండర్లు మృతిచెందారంది. అటు తదుపరి హెజ్బొల్లా పగ్గాలు ఎవరు అందుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Similar News

News October 23, 2024

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై కేంద్రం మండిపాటు

image

విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపుల విషయంలో సోషల్ మీడియాపై కేంద్రం తీవ్రంగా మండిపడింది. బెదిరింపులు ఎక్కువగా X, Fb వంటి ప్లాట్‌ఫాంల ద్వారానే జరగడం, వ్యాప్తి చెందడంతో నియంత్రణ చర్యలపై కేంద్రం ప్రశ్నల వర్షం కురిపించింది. కట్టడికి తీసుకున్న చర్యలు వివరించాలంది. విమానయాన, సోషల్ మీడియా సంస్థలతో భేటీలో కేంద్ర IT శాఖ ఉన్నతాధికారి సంకేత్ ‘మీరు నేరాల్ని ప్రోత్సహిస్తున్నట్లు అన్పిస్తోంది’ అని Xపై ధ్వజమెత్తారు.

News October 23, 2024

వేలంలోకి రిషభ్ పంత్? RCB తీసుకుంటుందా?

image

IPL మెగా వేలంలోకి DC కెప్టెన్ పంత్ వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని DC మేనేజ్‌మెంట్ అనుకోవట్లేదని, దీంతో వేలంలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేలంలోకి వస్తే ఆయన్ను తీసుకోవాలని RCB భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేఎల్ రాహుల్‌ను LSG, శ్రేయస్‌ను KKR వదులుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో వారంలో స్పష్టత రానుంది.

News October 23, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్.. అమలు ఇలా..

image

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 సిలిండర్లు కాకుండా 4 నెలలకొకటి ఇవ్వాలని నిర్ణయించింది. సిలిండర్‌కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ఆ సబ్సిడీ మొత్తం ఖాతాల్లో డిపాజిట్ కానుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.రూ.876 ఉండగా కేంద్రం సబ్సిడీ రూ.25 పోను మిగిలిన రూ.851 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.2,553 ఖాతాల్లో జమ కానున్నాయి.