News October 23, 2024
సిమెంట్ రంగంలో అదానీ దూకుడు
‘అంబుజా’ కొనుగోలుతో సిమెంట్ రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్ దూకుడు పెంచింది. దేశంలో అల్ట్రాటెక్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈక్రమంలో తాజాగా సీకే బిర్లాకు చెందిన ఓరియంట్ సిమెంట్‌ను చేజిక్కించుకోనుంది. మొత్తం రూ.8వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో సీకే బిర్లా, ఇతర వాటాదార్ల నుంచి 46.8% వాటా కోసం రూ.3,761 కోట్లు వెచ్చించనుంది. మరో 26% వాటాను ఓపెన్ ఆఫర్‌లో కొనుగోలు చేయనుంది.
Similar News
News January 3, 2025
తెలంగాణ ప్రజలకు ‘KA మోడల్’ ఛార్జీల భయం!
TG ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు <<15052988>>కర్ణాటక<<>> మోడల్‌నే అనుసరించింది. ఇప్పుడదే కొంపముంచేలా ఉంది. స్కీములకు డబ్బులేక అక్కడి సర్కారు ఎడాపెడా అప్పులు చేస్తూ, బస్సు సహా అన్ని ఛార్జీలూ పెంచేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా సహా స్కీములకు FY25లో ₹37,850CR తెచ్చిన రేవంత్ సర్కార్ మార్కెట్ సెక్యూరిటీల రూపంలో మరో ₹37,850CR అప్పుచేయనుంది. 10 ఏళ్లలో ₹2.86L CR అప్పు తీర్చాల్సిన TG GOVT ఇక వాయింపులు మొదలుపెట్టనుందా?
News January 3, 2025
జీన్స్ ఎక్కువగా ధరిస్తున్నారా?
ట్రెండీగా ఉండేందుకు ఆడ, మగా తేడా లేకుండా జీన్స్ ధరించేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే ఎక్కువగా జీన్స్ ప్యాంట్లు ధరించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌గా ఉండే జీన్స్‌తో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు వీటిని ధరించకపోవడమే మేలని అంటున్నారు. ఫ్రీగా ఉండే జీన్స్‌ను లేదా కాటన్ జీన్స్‌ను మితంగా వేసుకోవాలని సూచిస్తున్నారు.
News January 3, 2025
హైందవ శంఖారావానికి తరలిరండి: VHP
AP: విజయవాడ కేసరపల్లి వద్ద JAN 5న జరిగే హైందవ శంఖారావం సభకు హిందువులు తరలిరావాలని VHP పిలుపునిచ్చింది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో 30 ఎకరాల్లో భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వాలు హిందూ ఆలయాలను తమ అధీనంలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయని VHP నేత గోకరాజు గంగరాజు మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాల కోసం పోరాటం చేస్తామన్నారు.