News October 23, 2024

కడప: బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి

image

బిల్డింగ్ పైనుంచి జారి పడి ఉమ్మడికడప జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు..HYD మాదాపూర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న శివకుమార్ రెడ్డి భవనం పైనుంచి కిందపడిపోయాడు. గమనించిన కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. విద్యార్థి స్వస్థలం రైల్వే కోడూర్‌గా పోలీసులు గుర్తించారు.

Similar News

News November 7, 2025

సెలవులు రద్దు: కడప DEO

image

సెలవులపై కడప DEO షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూళ్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈక్రమంలో ఈ మూడు సెలవులను వర్కింగ్ డేస్‌గా ప్రకటించారు.

News November 6, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

News November 6, 2025

జమ్మలమడుగు: తండ్రి, కుమార్తెకు జైలుశిక్ష

image

జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన గంజి మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి ఒత్తిడి చేయడంతో అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. 2017 జనవరి 19న నాగులకట్ట వీధిలో తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. నేరం నిరూపణ కావడంతో మాధవి, సూర్యనారాయణకు కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది.