News October 23, 2024

HYD: DRDOలో ఉద్యోగాలు

image

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. HYD DRDOకు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో(RCI) తాత్కాలిక పద్ధతిన ఖాళీల భర్తీ చేస్తున్నారు. SEP-27న నోటిఫికేషన్ విడుదలైంది. 30 రోజుల్లోగా దరఖాస్తు(OCT-26) చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. BE, B.TECH, M.TECH, MSC, PHD చేసిన వారు అర్హులు.
LINK: www.drdo.gov.in/drdo/careers
SHARE IT

Similar News

News July 7, 2025

HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

image

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.

News July 7, 2025

HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

image

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.

News July 7, 2025

HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

image

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.