News October 23, 2024

భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా APలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంట గంటకు 80-90KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలంది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.

Similar News

News October 23, 2024

విరాట్‌ను దాటేసిన పంత్

image

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విరాట్ కోహ్లీని దాటేశారు. ఇంతకు ముందు విరాట్ 7వ స్థానంలో, పంత్ 9వ స్థానంలో ఉండగా తాజా ర్యాంకింగ్స్‌లో పంత్ ఆరో ప్లేస్‌కు చేరుకున్నారు. బంగ్లాతో సిరీస్‌లో సెంచరీ కొట్టిన రిషభ్, న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 20, 99 పరుగులతో రాణించారు. ఆ మ్యాచ్‌లో గాయపడగా, రేపటి మ్యాచ్‌లో ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నారని కోచ్ గంభీర్ తాజాగా వెల్లడించారు.

News October 23, 2024

ZOMATO, SWIGGY యూజర్లకు షాక్

image

పండగల సీజన్లో ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడం రొటీన్. రేట్లు పెంచడం, షాకులివ్వడమే వెరైటీ! ZOMATO, SWIGGY ఇలాగే చేశాయి. జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.6 నుంచి రూ.10కి పెంచిన కొన్ని గంటల్లోనే స్విగ్గీ సైతం రూ.10కి పెంచేసింది. EX. మీరేదైనా ఆర్డరిస్తే, దానిపై డెలివరీ ఫీజు రూ.36, ప్లాట్‌పామ్ ఫీజు రూ.10 అదనంగా చెల్లించాలి. AUG 2023లో రూ.2గా ఉన్న ఈ ఫీజు ఏడాదిలోనే 400% పెరిగింది.

News October 23, 2024

తర్వాతి మ్యాచ్ కోసం కేఎల్ రాహుల్ సాధన

image

టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. తొలి మ్యాచ్‌లో పంత్, సర్ఫరాజ్ వంటి యువ ఆటగాళ్లు రాణించగా, అనుభవజ్ఞుడైన రాహుల్ 0, 12 రన్స్‌కే ఔటయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ న్యూజిలాండ్ బౌలర్ ఓ రూర్కే బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యారు. దీంతో అదే హైట్ ఉన్న మోర్నే మోర్కెల్ బౌలింగ్‌లో రాహుల్‌ నెట్స్‌లో సాధన చేశారు. రేపు ఉదయం 9.30 గంటలకు రెండో టెస్టు మొదలుకానుంది.