News October 23, 2024
ఆయిల్ ట్యాంకర్‌లో ఇదేంది భయ్యా!

బిహార్‌లో ‘పుష్ప’ రేంజ్‌లో స్మగ్లింగ్ వెలుగుచూసింది. ముజఫర్‌పూర్‌లో హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించగా నిందితులు ఆ వాహనాన్ని జాతీయరహదారిపై వదిలి పరారయ్యారు. ట్యాంకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మద్యం కాటన్లు ఉన్నాయి. మద్యం అరుణాచల్‌ప్రదేశ్‌లో తయారైనట్లు పోలీసులు గుర్తించారు. బిహార్‌లో లిక్కర్ అమ్మకాలు నిషేధం. అందుకే స్మగ్లర్లు ఇలా తప్పుడు దారులు ఎంచుకుంటున్నారు.
Similar News
News January 8, 2026
గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.
News January 8, 2026
ఏంటి తమ్ముడూ ఈ ఆట.. ఇంకా పెంచుతావా: అశ్విన్

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత కొన్ని నెలలుగా <<18788014>>సంచలన ప్రదర్శన<<>> చేస్తున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. గత 30 రోజుల్లో దేశీయ, U-19 క్రికెట్‌లో వైభవ్ సాధించిన 171, 190, 108*, 127 వంటి భారీ స్కోర్లను Xలో షేర్ చేశారు. “ఏంటి తమ్ముడూ ఈ ఆట? ఇంకా పెంచుతావా?” అంటూ తమిళంలో కామెంట్స్ చేశారు. ఇంత చిన్న వయసులో ఇంతటి భారీ స్కోర్లు చేయడం అద్భుతమని కొనియాడారు.
News January 8, 2026
జనవరి 8: చరిత్రలో ఈరోజు

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్‌డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం


