News October 23, 2024

రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: KTR

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై వేటువేయాలని MLC జీవన్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై KTR స్పందించారు. ‘రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేత ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 23, 2024

వెంకయ్య నాయుడి మనవడి పెళ్లిలో సీఎం

image

AP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి పెళ్లికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సీఎంతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

News October 23, 2024

ఆ నీచమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేను: కేటీఆర్

image

TG: కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆర్ 30 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా, సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన <<14254371>>వ్యాఖ్యలు<<>> చేశారని అన్నారు. ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని, ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాతపూర్వక ఫిర్యాదును జడ్జి ముందు ఉంచారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

News October 23, 2024

పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

image

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.