News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

Similar News

News October 6, 2025

కర్నూలు టీచర్లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

image

విద్యారంగంలో విశిష్ట సేవలందించిన కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వైవీ రామకృష్ణ, ఎన్.విజయశేఖర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచ అధ్యాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో NHR SJC India–Global, UCP & LRF సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందజేశారు.

News October 5, 2025

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై పోటీలు: డీఈవో

image

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

News October 4, 2025

1100కు ఫోన్ చేయండి: కలెక్టర్

image

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని లెక్టర్ సిరి శనివారం వెల్లడించారు. అర్జీదారులు meekoస్am.ap.gov.in వెబ్ సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మండల కేంద్రంలో, మున్సిపాల్టీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.