News October 23, 2024

వారానికి 100 గంటలు పనిచేయాలి: మస్క్

image

పని ఒత్తిడి, అధిక పని గంటలతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వారానికి 100 గంటలు పని చేస్తేనే వేగంగా విజయాన్ని పొందొచ్చని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ‘మీరు వారానికి 100 గంటలు పనిచేస్తే ఇతరులు 50 గంటలు పనిచేసిన దానికంటే రెట్టింపు ఫలితం సాధిస్తారు. నేను, నా సోదరుడు రాత్రుళ్లు కోడింగ్ చేసేవాళ్లం’ అని తెలిపారు. దీనిపై మీకామెంట్?

Similar News

News October 23, 2024

రాష్ట్రంలో మెయనైస్‌పై నిషేధం?

image

TG: షావర్మా, ఫ్రైడ్ చికెన్, పిజ్జాపై మెయనైస్ వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే పచ్చిగుడ్డుతో తయారుచేసే మెయనైస్ వల్ల ఈ ఏడాది HYDలో 10 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తెల్లగా, క్రీమ్‌లాగా ఉండే మెయనైస్‌లో హానికర సూక్ష్మక్రిములు ఉంటాయని, దాన్ని బ్యాన్ చేయాలని కోరారు. కాగా ఇప్పటికే మెయనైస్‌పై కేరళ సర్కారు నిషేధం విధించింది.

News October 23, 2024

MH ఎన్నికలు.. 85 సీట్ల చొప్పున పోటీ

image

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది. 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు నిర్ణయించాయి. మిగతా 18 సీట్లపై కూటమిలోని మిగతా పార్టీలతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. ఈసారి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News October 23, 2024

గొంతులో దోశ ఇరుక్కుని చనిపోయాడు!

image

TG: గొంతులో దోశ ఇరుక్కుని వ్యక్తి మరణించిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య (41) ఇంట్లో మద్యం తాగి దోశ తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గతంలో కేరళలో ఇడ్లీలు తినే పోటీలో ఓ వ్యక్తి ఇడ్లీలు తింటూ ఊపిరాడక చనిపోయాడు.