News October 23, 2024

విరాట్‌ను దాటేసిన పంత్

image

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విరాట్ కోహ్లీని దాటేశారు. ఇంతకు ముందు విరాట్ 7వ స్థానంలో, పంత్ 9వ స్థానంలో ఉండగా తాజా ర్యాంకింగ్స్‌లో పంత్ ఆరో ప్లేస్‌కు చేరుకున్నారు. బంగ్లాతో సిరీస్‌లో సెంచరీ కొట్టిన రిషభ్, న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 20, 99 పరుగులతో రాణించారు. ఆ మ్యాచ్‌లో గాయపడగా, రేపటి మ్యాచ్‌లో ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నారని కోచ్ గంభీర్ తాజాగా వెల్లడించారు.

Similar News

News February 3, 2026

మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

image

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.

News February 3, 2026

ఇండియాలో ఫార్ములా వన్ రీఎంట్రీ!

image

ఇండియాలోకి ఫార్ములా వన్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్రం, ఫార్ములా వన్ యాజమాన్యం మధ్య ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. 2011లో నోయిడా సర్క్యూట్‌‌లో దేశంలోనే తొలిసారి F1కార్లు పరుగులు తీశాయి. 2013లో చివరి సారిగా రేసు జరిగింది. భారీ పన్నులు, ఇతర సమస్యలతో ఇండియాకు F1 దూరమైంది. 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు జరిగిన విషయం తెలిసిందే.

News February 3, 2026

బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు<<18311087>> మరో షాక్ <<>>తగిలింది. ఢాకా స్పెషల్‌ జడ్జస్‌ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు వేర్వేరు అవినీతి కేసులకు సంబంధించి ఈ తీర్పునిచ్చింది. ఒక్కో కేసుకు 5 ఏళ్ల చొప్పున శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. పుర్బాచోల్‌లోని రాజుక్‌ న్యూ టౌన్‌ ప్రాజెక్టు కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న అభియోగాలతో హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు శిక్ష ఖరారు చేసింది.