News October 23, 2024
ప్రపంచ రికార్డు: 20 ఓవర్లలో 344 రన్స్ బాదేశారు!

పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట ఉన్న 314 రన్స్‌ను బద్దలుగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లలో సికందర్ రజా 33 బంతుల్లోనే సెంచరీ(15 సిక్సులు) చేశారు. టీ20 వరల్డ్ కప్‌నకు క్వాలిఫయర్ మ్యాచులు ఆఫ్రికా దేశాల మధ్య జరుగుతున్నాయి.
Similar News
News February 2, 2026
ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

☛ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
☛ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
☛ 1940: రచయిత ఎస్.వి. రామారావు జననం
☛ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
☛ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
☛ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం (ఫొటోలో)
News February 2, 2026
గజినీ తరహా రోల్‌లో సూర్య! ఆసక్తి రేపుతున్న కొత్త మూవీ టైటిల్..

కోలీవుడ్ స్టార్ సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జులైలో విడుదల కానున్న ఈ చిత్రంలో సూర్య పాత్ర గజినీ తరహాలో ఉంటుందని టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీతో సూర్య నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో రాధిక, రవీనా టాండన్, హీరోయిన్‌గా మమితా బైజు నటిస్తున్నారు.
News February 2, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


