News October 23, 2024
తూ.గో: ఖరీఫ్ సీజన్ తొలి ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 48 గంటల్లోగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని తూ.గో జిల్లా జేసీ ఎస్.చిన్న రాముడు తెలిపారు. నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వద్ద 16.40 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్టోబరు 21న సేకరించామన్నారు. బుధవారం రైతు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు.
Similar News
News November 23, 2024
తూ.గో: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు
పీ.యు.సీ. కమిటీ ఛైర్మన్గా ఎంపికైన కూన రవి కుమార్ మైన్స్ & జియాలజీ, ఎక్సైజ్ శాఖా మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఎంపికైన ఏలూరి సాంబశివరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి ఇతర సభ్యులతో కలసి రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
News November 22, 2024
తూ.గో: CBI నుంచి అంటూ ఫేక్ కాల్
పి.గన్నవరానికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని తండ్రికి గురువారం డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది. CBI నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్యక్తి(పై ఫోటో) వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించాడు. మీ కుమార్తెను అరెస్ట్ చేశామని, తమ అదుపులో ఉందని చెప్పాడు. అయితే కొద్దిసేపటి ముందే తన కుమార్తెతో మాట్లాడిన చంద్రశేఖర్ ఫేక్ కాల్ అని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ట్రాప్ కాల్స్ వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News November 22, 2024
ఉభయ గోదావరి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఐదుగురే.!
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చివరకు ఐదుగురే మిగిలారు. ఉపఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. 1.గంధం నారాయణరావు, 2.దీపక్ పులుగు, 3.నాగేశ్వరరావు కవల, 4.నామన వెంకట లక్ష్మీ, 5.బొర్రా గోపీ మూర్తి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు. 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.