News October 23, 2024

ఇండియా వెనక్కి తగ్గదు, ఓటమిని ఒప్పుకోదు: బ్రెట్‌ లీ

image

క్రికెట్‌లో టీమ్ ఇండియా శక్తిమంతమైనదని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డారు. ఓటమి ఒప్పుకొని వెనక్కి తగ్గే అలవాటు ఆ జట్టుకు లేదన్నారు. ‘భారత్ ఒకప్పటి లాంటి జట్టు కాదు. ఎప్పుడైనా, ఎలాంటి జట్టునైనా మట్టి కరిపించగలమని భారత్‌కు తెలుసు. AUSను ఓడించగలమని కూడా తెలుసు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో నిర్లక్ష్యంగా ఆడటం వల్ల ఓడింది. రెండో టెస్టులో కచ్చితంగా పుంజుకుంటుంది’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 24, 2024

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

News October 24, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు

image

AP: వక్ఫ్ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకించాలని ఆలిండియా ముస్లిం లా బోర్డు, పలు ముస్లిం సంఘాలు సీఎం చంద్రబాబుని కోరాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎంని కలిసి వినతిపత్రం అందించాయి. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. 2026 మార్చి కన్నా ముందే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.

News October 24, 2024

ఆ ఘటన తర్వాతే గ్లామర్ పాత్రలు వద్దనుకున్నా: సాయి పల్లవి

image

సినిమాల్లో శరీరం కనిపించేలా డ్రస్సెస్ వేసుకోకూడదని తాను నియమంలా పెట్టుకున్నట్లు నటి సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను జార్జియాలో మెడిసిన్ చదువుకున్నా. అక్కడ ఓసారి టాంగో డాన్స్ చేశాను. సినిమాల్లో పేరు వచ్చాక ఆ డాన్స్ వీడియో వైరల్ అయింది. రకరకాల కామెంట్స్ వచ్చాయి. బాధ అనిపించింది. స్కిన్ షో పాత్రలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నా’ అని వివరించారు.