News October 23, 2024
ప్రియాంకా గాంధీకి బెస్ట్ విషెస్: సీఎం రేవంత్

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీకి సీఎం రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రియాంకా గాంధీకి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను. ఆమె తన శక్తిమంతమైన స్వరంతో ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Similar News
News February 8, 2026
ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. ఇంకా కోలుకోని పాక్!

గతేడాది పాక్‌లోని ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలపై ‘<<16454711>>ఆపరేషన్ సిందూర్<<>>’తో భారత్ విరుచుకుపడటం తెలిసిందే. 10 నెలలవుతున్నా పాక్ కోలుకున్నట్లు లేదు. అక్కడి భోలారీ హాంగర్‌ను ఇంకా రిపేర్ చేసుకోలేదు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను NDTV బయటపెట్టింది. ధ్వంసమైన రూఫ్‌ను తొలగించినట్లు తెలిపింది. మురిద్‌లో టార్పాలిన్ కప్పి పనులు చేస్తున్నారని, సుక్కుర్, నూర్ ఖాన్ బేస్‌లోనూ రిపేర్లు చేస్తున్నట్లు చెప్పింది.
News February 8, 2026
వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారట.
News February 8, 2026
BPNSIలో రూ. లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

<


