News October 24, 2024

సహజంగా శక్తిని అందించే ఆహార పదార్థాలేవంటే..

image

నీరసం తగ్గేందుకు లేదా శక్తి కోసం కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. దాని బదులు ప్రకృతిసిద్ధంగా లభించే ఆహార పదార్థాల్ని తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అవి.. అరటిపళ్లు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్, గ్రీక్ యోగర్ట్, గుడ్లు, యాపిల్స్, చియా గింజలు, చిలగడ దుంపలు, పాలకూర. వీటిని అవసరమైనంత మేర తీసుకుంటుంటే నీరసం దరి చేరదని వారు చెబుతున్నారు.

Similar News

News October 24, 2024

వార్-2లో షారుఖ్ ఖాన్?

image

ఎన్డీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్2’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ సైతం ప్రారంభించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ముగ్గురు అగ్రహీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

News October 24, 2024

కలుషిత నీరే కారణం.. గుర్లలో డయేరియాపై నివేదిక

image

AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.

News October 24, 2024

పోలీసుల్ని మర మనుషుల్లా చూస్తున్నారు: ప్రవీణ్ కుమార్

image

TG: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ‘పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి మర మనుషుల్లా చూస్తున్నారు. నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇస్తామనడం దారుణం. దీనిపై పోలీసుల కుటుంబాలు నల్గొండలో ఆందోళన చేస్తే విధుల్లో ఉన్న పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పోలీసుల్లో అశాంతి నెలకొంది. అది ప్రమాదకరం’ అని అన్నారు.