News October 24, 2024

PPM: ‘హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

image

పార్వతీపురం జిల్లాలో రక్తహీనతతో ఉండే గర్భిణీలపై, హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని  కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఎటువంటి మాతా, శిశు మరణాలు జరగకూడదని, దీనికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు.

Similar News

News January 13, 2026

పోలీసు పరేడ్ గ్రౌండులో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

image

విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో సంక్రాంతి సంబరాలను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీమణి ఎ.ఆర్.రూపా నాయుడు ముఖ్య అతిధిగా హాజరై సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు పోలీసు కుటుంబాలను కూడా భాగస్వాములను చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

News January 13, 2026

‘విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదు’

image

రబీ 2025–26 పంట కాలానికి విజయనగరం జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 12,606 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా.. ప్రస్తుతం 2,914 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొంది. అదనంగా 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుంది. రైతులు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని అధికారులు సూచించారు.

News January 13, 2026

15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

image

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.