News October 24, 2024
రెస్టారెంట్స్ ఫుడ్ క్వాలిటీ చెప్పే ‘స్విగ్గీ సీల్’

రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార ప్రమాణాలను ధ్రువీకరించేందుకుగాను స్విగ్గీ సీల్ అనే కొత్త సేవలను స్విగ్గీ తీసుకురానుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే రెస్టారెంట్లకు ఈ బ్యాడ్జ్‌ని స్విగ్గీ అందిస్తుంది. కస్టమర్ల నుంచి ఫిర్యాదులొస్తే ఆ బ్యాడ్జిని తొలగిస్తుంది. పరిశుభ్రతపై ఆడిట్ నిర్వహించేందుకు FSSAI గుర్తింపు పొందిన సంస్థలతో టై-అప్ అయినట్లు కంపెనీ తెలిపింది. NOV నాటికి 650 నగరాల్లో ఈ సేవలు తీసుకురానుంది.
Similar News
News March 18, 2025
మైనార్టీలపై వేధింపుల ఆరోపణలు.. ఖండించిన యూనస్ ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలను యూనస్ ప్రభుత్వం ఖండించింది. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. తమ దేశానికి అపవాదు తెచ్చేలా ఆమె మాట్లాడారని మండిపడింది. భారత్ పర్యటనలో ఉన్న తులసి బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆమె కలిశారు.
News March 18, 2025
ఆ విషయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

TG: గోదావరి నుంచి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్‌లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు.
News March 18, 2025
ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.