News October 24, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు

image

AP: వక్ఫ్ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకించాలని ఆలిండియా ముస్లిం లా బోర్డు, పలు ముస్లిం సంఘాలు సీఎం చంద్రబాబుని కోరాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎంని కలిసి వినతిపత్రం అందించాయి. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. 2026 మార్చి కన్నా ముందే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.

Similar News

News October 24, 2024

నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన

image

AP: విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు అక్కడికి చేరుకుంటారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. కాగా గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

News October 24, 2024

వర్సిటీల ప్రగతిపై 3 నెలలకోసారి సమీక్షిస్తా: గవర్నర్

image

TG: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవుతానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. విద్యాపరంగా సాధించిన వృద్ధిపై సమీక్ష చేపడతానని చెప్పారు. ఉన్నత విద్య రూపురేఖలు మార్చడంలో వీసీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య, విస్తృతమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారేందుకు కృషి చేయాలని తనను కలిసిన కొత్త వీసీలకు సూచించారు.

News October 24, 2024

ముసుగు తొలిగిపోయింది: YCP

image

AP: జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై TDP<<14435746>> ట్వీట్<<>> చేయడంపై YCP స్పందించింది. ‘ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను TDP అఫీషియల్ హ్యాండిల్స్‌లో పెట్టినప్పుడే మీరంతా ఒకటేనని స్పష్టమైంది. అనుబంధాల గురించి CBN మాట్లాడటం విడ్డూరం. తన ఆస్తుల్లో తోబుట్టువులకు CBN ఎంతిచ్చారు? NTRకు వెన్నుపోటు పొడవలేదా? హరికృష్ణను, తనతో పాటు హెరిటేజ్ పెట్టిన నటుడ్ని గెంటేయలేదా?’ అని నిలదీసింది.