News October 24, 2024

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

Similar News

News October 24, 2024

IND Vs NZ.. రసవత్తర పోరుకు సిద్ధం

image

భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. పుణే వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ప్రతికూల పిచ్‌తో ఓటమి పాలైన భారత్ బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్ రూపొందించింది. బ్యాటింగ్‌లో గిల్ రాకతో ఎవరిని తప్పిస్తారనేది ప్రశ్నార్థకం. సిరాజ్‌కు బదులు ఆకాశ్‌దీప్‌ను తీసుకునే అవకాశముంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

News October 24, 2024

నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన

image

AP: విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు అక్కడికి చేరుకుంటారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. కాగా గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

News October 24, 2024

వర్సిటీల ప్రగతిపై 3 నెలలకోసారి సమీక్షిస్తా: గవర్నర్

image

TG: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవుతానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. విద్యాపరంగా సాధించిన వృద్ధిపై సమీక్ష చేపడతానని చెప్పారు. ఉన్నత విద్య రూపురేఖలు మార్చడంలో వీసీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య, విస్తృతమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారేందుకు కృషి చేయాలని తనను కలిసిన కొత్త వీసీలకు సూచించారు.