News October 24, 2024
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో రతన్ టాటాకు అరుదైన గౌరవం

స్వర్గీయ రతన్ టాటా గౌరవార్థం ఆయన పేరిట ఓ భవనాన్ని నిర్మించాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్ణయించింది. సోమర్‌విలే కాలేజీ, టాటా గ్రూప్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుంది. ఇందులో ఆక్స్‌ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్(OICSD)ని ఏర్పాటు చేస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ప్రపంచాన్ని వేధించే సమస్యల పరిష్కారాలకు ఇక్కడ అధ్యయనం నిర్వహిస్తామని వివరించింది.
Similar News
News January 15, 2026
మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

TG: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, SC మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ST మహిళలకు 2 స్థానాలు కేటాయించింది. 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీకి ఒక స్థానంలో కేటాయింపులు చేసింది. ఈ నెల 17లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.
News January 15, 2026
భారత్ ఓటమి.. వీటికి సమాధానమేది?

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమ్ ఇండియా ఓటమితో పలు ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జడేజా తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఎంత వరకు కరెక్ట్? బుమ్రాకు రెస్ట్ ఉన్న సమయంలో స్టార్ బౌలర్‌గా పేరున్న అర్షదీప్ సింగ్‌ను బెంచ్ పరిమితం చేయడమేంటి? పదే పదే జడేజాను నమ్ముకోకుండా ప్రత్నామ్నాయంపై దృష్టి పెట్టాలి’ అని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. మీరేమంటారు?
News January 14, 2026
‘నారీనారీ నడుమ మురారి’ రివ్యూ&రేటింగ్

పెళ్లి చేసుకునే సమయంలో మాజీ ప్రేయసి ఎంట్రీతో ఎదురైన పరిస్థితులను హీరో ఎలా పరిష్కరించుకున్నాడనేదే స్టోరీ. శర్వానంద్, సంయుక్త, సాక్షి నటనతో మెప్పించారు. సత్య, నరేశ్, వెన్నెల కిశోర్ కామెడీ అదిరిపోయింది. హీరో శ్రీవిష్ణు క్యామియో సినిమాకు ప్లస్. క్లైమాక్స్ డిఫరెంట్‌గా ఉంది. మ్యూజిక్ యావరేజ్. కొన్ని సీన్లు రిపీట్ అనిపిస్తాయి. ఫన్, ఎమోషన్లతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది.
Way2News రేటింగ్: 3/5


