News October 24, 2024

కలుషిత నీరే కారణం.. గుర్లలో డయేరియాపై నివేదిక

image

AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.

Similar News

News October 24, 2024

రేపటి నుంచి అమెరికా పర్యటనకు లోకేశ్

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు గాను మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి నవంబర్ 1వరకు ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, పెప్సికో వంటి దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు.

News October 24, 2024

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

image

TG: రాష్ట్రంలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని డిస్కం సీఎండీ ముషారఫ్ స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని చెప్పారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్‌డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముషారఫ్ ఇలా స్పందించారు.

News October 24, 2024

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక

image

AP: కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేసింది. ఆయా రోజులలో స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిచ్చింది. సాధారణ రోజులలో అభిషేకాలు, స్పర్శ దర్శనాలు మూడు విడతలుగా అందుబాటులో ఉండనున్నాయి. కాగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి.