News October 24, 2024

వర్సిటీల ప్రగతిపై 3 నెలలకోసారి సమీక్షిస్తా: గవర్నర్

image

TG: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవుతానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. విద్యాపరంగా సాధించిన వృద్ధిపై సమీక్ష చేపడతానని చెప్పారు. ఉన్నత విద్య రూపురేఖలు మార్చడంలో వీసీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య, విస్తృతమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారేందుకు కృషి చేయాలని తనను కలిసిన కొత్త వీసీలకు సూచించారు.

Similar News

News October 24, 2024

పింఛన్లకు వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల విధానం ఇదే

image

AP: పింఛను లబ్ధిదారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఆరంచెల విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంది. దీని ప్రకారం దరఖాస్తుదారులకు వ్యవసాయ భూమి 10ఎకరాలకు మించొద్దు. ఇంట్లో ప్రభుత్వ జాబ్, 4 వీలర్ వెహికల్, IT చెల్లింపు, విద్యుత్ మీటర్ రీడింగ్ 6నెలలకు సరాసరిన 300 యూనిట్లకు మించి ఉండకూడదు. పట్టణాల్లో 1000 చ.అడుగుల పైన నివాసం ఉండొద్దు. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

News October 24, 2024

యాంటీ టెర్రరిస్టు యాక్ట్: హసీనా స్టూడెంట్ వింగ్‌పై బ్యాన్

image

అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ ‘బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్’ను యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బ్యాన్ చేసింది. హసీనా 15ఏళ్ల నిరంకుశ పాలనలో వీరు లెక్కలేనన్ని నేరాలు చేసినట్టు పేర్కొంది. ఆమెపై ఉద్యమించిన స్టూడెంట్ గ్రూప్ ADSM డిమాండ్ మేరకే ఛాత్రా లీగ్‌ను బ్యాన్ చేయడం గమనార్హం. హసీనాకు మద్దతుగా మరో ఉద్యమం నిర్మిస్తారనే బ్యాన్ చేసినట్టు ఛాత్రా లీగ్ సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు.

News October 24, 2024

డిసెంబర్ 15న ఆత్మార్పణ దినం

image

AP: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గౌరవార్థం డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, NOV 1న రాష్ట్ర అవతరణ, జూన్ 2న రాష్ట్ర విభజన తేదీల్లో దేనిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై చర్చించింది. దీనిపై మంత్రుల సూచనలను CM కోరారు. జూన్ 2ను నవనిర్మాణ దినంగా నిర్వహించనున్నారు.