News October 24, 2024

IND Vs NZ.. రసవత్తర పోరుకు సిద్ధం

image

భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. పుణే వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ప్రతికూల పిచ్‌తో ఓటమి పాలైన భారత్ బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్ రూపొందించింది. బ్యాటింగ్‌లో గిల్ రాకతో ఎవరిని తప్పిస్తారనేది ప్రశ్నార్థకం. సిరాజ్‌కు బదులు ఆకాశ్‌దీప్‌ను తీసుకునే అవకాశముంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

Similar News

News October 24, 2024

BSNL కనెక్టింగ్ భారత్‌పై నెటిజన్ల చర్చ ఎలా ఉందంటే!

image

BSNL కొత్త లోగోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లోగోలో భారత్ మ్యాప్‌ను ఉంచడం, కనెక్టింగ్ ఇండియా ట్యాగ్‌లైన్‌ను కనెక్టింగ్ భారత్‌గా మార్చడం బాగుందని కొందరు అంటున్నారు. భారతీయత కనిపిస్తోందని చెప్తున్నారు. మార్చాల్సింది లోగో కాదని, బిజినెస్ స్ట్రక్చర్, అందించాల్సిన సేవలని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెప్పుడు 4G, 5G అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. DD లోగో మార్చినప్పుడూ ఇలాంటి కామెంట్సే వచ్చాయి.

News October 24, 2024

పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను అప్పటిలోగా పూర్తి చేయాలి: సీఎం

image

AP: పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2026 మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బావర్ కంపెనీ ప్రతినిధులను CM చంద్రబాబు ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఏటా ₹983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ₹275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జల వనరుల శాఖ సమీక్షలో తెలిపారు. ఇక నుంచి అలా జరగరాదని, ఈ ఏడాదికి అవసరమైన మొత్తం నిధులను ఏకకాలంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News October 24, 2024

ఉచిత సిలిండర్.. బుకింగ్స్ ఎప్పుడంటే?

image

AP: ఈనెల 31 నుంచి ఉచిత సిలిండర్ పథకం ప్రారంభం కానుంది. దానికి 3,4 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈనెల 31 నుంచి 2025 MAR నెలాఖరులోపు ఒక సిలిండర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత 2025 APR 1 నుంచి JULY నెలాఖరు వరకు మొదటిది, AUG 1 నుంచి NOV లాస్ట్ వరకు రెండోది, DEC 1 నుంచి 2026 MAR నెలాఖరు నాటికి మూడో సిలిండర్ ఇస్తారు. డెలివరీ సమయంలో డబ్బులు చెల్లిస్తే 48గంటల్లో ఖాతాల్లో ప్రభుత్వం ఆ సొమ్మును జమ చేస్తుంది.