News October 24, 2024
అందుకే షర్మిలపై జగన్ పిటిషన్: YCP
AP: ఆస్తుల విషయంలో చెల్లికి మంచి చేయబోయి జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని YCP తెలిపింది. ‘సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలున్నాయి. కేసులు తేలాక ఆస్తులు ఇస్తానని MoU రాసిచ్చారు. కానీ చట్ట విరుద్ధంగా <<14429978>>షేర్లు <<>>బదిలీ చేయడమే సమస్యకు కారణమైంది. ఇది జగన్ బెయిల్ రద్దుకు పరిస్థితులు సృష్టించడం కాదా? గత్యంతరం లేక లీగల్ స్టెప్ తీసుకున్నారు. జగన్ పదేళ్లలో రూ.200Cr షర్మిలకు ఇచ్చారు’ అని తెలిపింది.
Similar News
News January 3, 2025
8న విశాఖలో రైల్వేజోన్‌కు ప్రధాని శంకుస్థాపన
AP: PM మోదీ 8న విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోని సభా ప్రాంగణం వరకు మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. పూడిమడకలో NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, తదితర అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
News January 3, 2025
ఫిబ్రవరిలో పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికలు!
TG: పంచాయతీ ఎలక్షన్లతో పాటు లేదా కొద్దిరోజుల గ్యాప్‌తో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 26తో మున్సిపాలిటీల గడువు ముగియనుండగా సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసి FEB మొదటివారంలోగా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడకపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. మున్సిపాలిటీలకు ఆ సమస్య లేకపోవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News January 3, 2025
నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు HYDలోని హైటెక్స్‌లో జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సభలను ప్రారంభించనున్నారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఎల్లుండి ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.