News October 24, 2024
ALERT: భారీ వర్షాలు

AP: తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాన్ ఏ క్షణమైనా తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకావం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.
Similar News
News March 17, 2025
మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలా అని ఒకటితో సరిపెట్టరు. ఇలా ఎక్కువగా చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోవడంతో పాటు వాటికి రంధ్రాలు ఏర్పడే ఆస్కారం ఉంది. అలాగని వాటిని తినకుండా ఉంచలేం. కాబట్టి రాత్రి పడుకునే ముందు వారితో బ్రష్ చేయిస్తే పళ్ల మధ్య అతుక్కుపోయిన చాక్లెట్ బయటికి వస్తుంది. దీంతో 10 గంటల వరకూ పళ్లకు రక్షణ కలుగుతుంది.
News March 17, 2025
నేడు అసెంబ్లీలోకి చరిత్రాత్మక బిల్లులు

నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. SCవర్గీకరణకు చట్టబద్ధతతో పాటు BCలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభ ముందుకు రానుంది. వీటిపై సభలో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణకు షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రస్తుతం BCలకు 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
News March 17, 2025
IPL: RRతో మ్యాచ్‌కు SRH జట్టు ఇదేనా?

IPL 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడనుంది. ఈ నెల 23న జరిగే ఈ మ్యాచులో బరిలోకి దిగే తుది జట్టును ESPN క్రిక్‌ఇన్ఫో అంచనా వేసింది. ముల్డర్, మెండిస్, జంపాను పరిగణనలోకి తీసుకోలేదు. జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్, అభినవ్ మనోహర్, కమిన్స్ (C), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ. జట్టు అంచనాపై మీ కామెంట్.