News October 24, 2024

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక

image

AP: కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేసింది. ఆయా రోజులలో స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిచ్చింది. సాధారణ రోజులలో అభిషేకాలు, స్పర్శ దర్శనాలు మూడు విడతలుగా అందుబాటులో ఉండనున్నాయి. కాగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి.

Similar News

News October 24, 2024

మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్

image

TG: గత ప్రభుత్వంలోని ముఖ్యులపై ఫైల్స్ సిద్ధమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నవంబర్ 1 నుంచి 8 వరకు అందరూ లోపలికి వెళతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మరో రెండుమూడు రోజుల్లో సంచలనం జరగబోతోందంటూ బాంబు పేల్చారు. మంత్రి దేని గురించి మాట్లాడారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News October 24, 2024

నవంబర్ మొదటి వారంలో మెగా డీఎస్సీ?

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.

News October 24, 2024

భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం

image

AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.