News October 24, 2024

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

image

TG: రాష్ట్రంలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని డిస్కం సీఎండీ ముషారఫ్ స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని చెప్పారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్‌డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముషారఫ్ ఇలా స్పందించారు.

Similar News

News October 24, 2024

నవంబర్ మొదటి వారంలో మెగా డీఎస్సీ?

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.

News October 24, 2024

భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం

image

AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.

News October 24, 2024

జగన్ హయాంలోనే డ్రోన్ల వినియోగం: YCP

image

AP: కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో శాడిస్ట్ చంద్రబాబుది అందెవేసిన చేయి అంటూ వైసీపీ విమర్శించింది. వైఎస్ జగన్ హయాంలో డ్రోన్లని విరివిగా వాడినా ఇప్పుడు ఆ ఘనత తనదేనంటూ చంద్రబాబు గప్పాలు కొడుతున్నారని మండిపడింది. ఇదంతా జనం చూసి నవ్విపోతారనే సోయి లేకపోతే ఎలా అంటూ ట్వీట్ చేసింది. జగన్ హయాంలో ఎరువులు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లను వాడినట్లు పేర్కొంది.