News October 24, 2024
డిసెంబర్ 15న ఆత్మార్పణ దినం

AP: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గౌరవార్థం డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, NOV 1న రాష్ట్ర అవతరణ, జూన్ 2న రాష్ట్ర విభజన తేదీల్లో దేనిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై చర్చించింది. దీనిపై మంత్రుల సూచనలను CM కోరారు. జూన్ 2ను నవనిర్మాణ దినంగా నిర్వహించనున్నారు.
Similar News
News February 20, 2026
యూరియా, వేపపిండిని కలిపి వాడటం వల్ల లాభాలు

సాధారణంగా పంటకు వేసిన యూరియా త్వరగా ఆవిరికావడం, నీళ్లలో కొట్టుకుపోవడం జరుగుతుంది. దీన్ని వేపపిండితో కలిపి వాడితే యూరియాలో నత్రజని నెమ్మదిగా కరిగి మొక్కలకు స్థిరంగా, ఎక్కువ కాలం పాటు అందుతుంది. దీని వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నత్రజని వృథా 20-30% తగ్గుతుంది. నేల ఆరోగ్యం పెరిగి, వేరుకుళ్లు, నులి పురుగుల సమస్య తగ్గుతుంది. 50 కేజీల యూరియాకు నిపుణుల సూచనలతో 5KGల వేపపిండి కలపడం మంచిది.
News February 20, 2026
ఏఐ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో CBN భేటీ కానున్నారు. ఉదయం ప్లీనరీ సెషన్‌లో, మధ్యాహ్నం WEF నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు తెలంగాణ ఏఐ పాలసీపై CM రేవంత్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో ఏఐ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రోత్సాహం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులపై మాట్లాడనున్నారు.
News February 20, 2026
కోటి విద్యలకంటే కోరుకొని పొలం దున్నడం మేలు

లోకంలో వేల సంఖ్యలో విద్యలు, వృత్తులు ఉన్నాయి. ఎవరు ఏ ఉద్యోగం, పని చేసినా అది ఆహారం కోసమే. మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించినా ఆకలి తీర్చుకోవడానికి అన్నమే తినాలి. ఆ అన్నాన్ని పండించేది వ్యవసాయం మాత్రమే. కాబట్టి ఇతరుల దగ్గర బానిసలుగా, ఒత్తిడితో ఉద్యోగాలు చేయడం కంటే వ్యవసాయం చేస్తూ కష్టపడి బతకడం మేలని, ఇది మనిషికి మానసిక తృప్తిని, స్వేచ్ఛను ఇస్తుందని ఈ సామెత చెబుతుంది.


