News October 24, 2024

యాంటీ టెర్రరిస్టు యాక్ట్: హసీనా స్టూడెంట్ వింగ్‌పై బ్యాన్

image

అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ ‘బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్’ను యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బ్యాన్ చేసింది. హసీనా 15ఏళ్ల నిరంకుశ పాలనలో వీరు లెక్కలేనన్ని నేరాలు చేసినట్టు పేర్కొంది. ఆమెపై ఉద్యమించిన స్టూడెంట్ గ్రూప్ ADSM డిమాండ్ మేరకే ఛాత్రా లీగ్‌ను బ్యాన్ చేయడం గమనార్హం. హసీనాకు మద్దతుగా మరో ఉద్యమం నిర్మిస్తారనే బ్యాన్ చేసినట్టు ఛాత్రా లీగ్ సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు.

Similar News

News October 24, 2024

BREAKING: జానీ మాస్టర్‌కు బెయిల్

image

కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో అరెస్టయిన జానీ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డు కూడా రద్దయిన విషయం తెలిసిందే.

News October 24, 2024

సుందర్‌కు చోటు: టీమ్ఇండియా భయపడిందన్న గవాస్కర్

image

NZతో రెండో టెస్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటివ్వడం టీమ్‌ఇండియా భయానికి సంకేతమని సునిల్ గవాస్కర్ అన్నారు. అందుకే కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోలేదన్నారు. ‘సాధారణంగా గాయాల బెడద ఉంటే తప్ప జట్టులోంచి ముగ్గుర్ని తప్పించరు. బ్యాటింగ్ డెప్త్‌పై ఆందోళనతోనే కుల్‌దీప్‌ను కాదని సుందర్‌ను తీసుకున్నారు. నిజమే, NZలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కానీ కుల్‌దీప్ వారికి దూరంగా బంతిని టర్న్ చేయగలరు’ అని వివరించారు.

News October 24, 2024

అవినాశ్ రెడ్డిని విమర్శిస్తున్నారని కేసు పెట్టడం ఏంటి జగన్?: TDP

image

AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్‌మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్‌ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.