News October 24, 2024

OTD: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

image

టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతోంది. 2018లో ఇదేరోజున స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 157 రన్స్ చేశారు. దీంతో వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేసిన 12వ బ్యాటర్‌గా కోహ్లీ నిలిచారు. 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడంతో సచిన్ టెండూల్కర్‌(259) పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు.

Similar News

News December 26, 2025

ఢిల్లీలో పరేడ్.. జగిత్యాల మేడం సెలక్ట్..!

image

JAN 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు TG & AP NCC క్యాడెట్స్‌ను సెలక్ట్ చేశారు. ఇందులో భాగంగా జగిత్యాలకు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్, PET చేని మంగా ANOగా ఎంపికయ్యారు. TG & AP డైరెక్టరేట్ NCC క్యాడెట్స్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, విశ్వప్రసాద్, నిరంజన్, రవికుమార్, కృష్ణప్రసాద్, క్రీడాకారులు మంగను అభినందించారు.

News December 26, 2025

రింకూ సింగ్ సెంచరీ

image

విజయ్ హజారే ట్రోఫీలో UP కెప్టెన్ రింకూ సింగ్ అదరగొట్టారు. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఆర్యన్ జుయల్ (134) కూడా చెలరేగడంతో UP 50 ఓవర్లలో 367/4 పరుగుల భారీ స్కోరు చేసింది. మరోవైపు గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లీ(77), పంత్(70) హాఫ్ సెంచరీలతో ఢిల్లీ 254/9 స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమైనా హార్దిక్ తమోర్(93) రాణించడంతో ముంబై 331/7 కొట్టింది.

News December 26, 2025

పీరియడ్స్‌లో వీటికి దూరంగా ఉండండి

image

పీరియడ్స్ సమయంలో వాకింగ్, యోగా వంటి తక్కువ ప్రభావమున్న వ్యాయామాలు చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, అధిక బరువులు ఎత్తడం, రన్నింగ్, దూకడం, వంటి శరీరంపై అధిక ప్రభావం చూపించే వ్యాయామాలు చేయకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్డియో, ఓవర్‌హెడ్ , క్రంచెస్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు చేయకూడదని చెబుతున్నారు. వీటివల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేఅవకాశముందని నిపుణులు చెబుతున్నారు.