News October 24, 2024

HEART TOUCHING: తండ్రే కొడుకై మళ్లీ పుట్టాడేమో!

image

గద్వాల(D) తుమ్మలపల్లికి చెందిన శివ(28)కు కర్నూలు(D) బనగానపల్లెకు చెందిన లక్ష్మీతో పెళ్లైంది. భార్య నిండు గర్భిణి కావడంతో పుట్టింటికి పంపాడు. అయితే మంగళవారం బైక్‌ నుంచి పడి గాయపడ్డ శివను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మీకి కూడా నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం రాత్రి 2 గంటలకు పరిస్థితి విషమించడంతో శివ మృతి చెందాడు. ఆ తర్వాత గంటకే లక్ష్మీ మగబిడ్డకు జన్మనిచ్చారు.

Similar News

News November 7, 2025

మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

image

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్‌మెంట్‌ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.

News November 6, 2025

రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్.. డేట్ ఫిక్స్

image

ఇన్ఫోసిస్ ఈ నెల 14న ₹18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్‌కు నందన్ నీలేకని, సుధామూర్తి సహా కంపెనీ ప్రమోటర్లు దూరంగా ఉండనున్నారు. వీరికి సంస్థలో 13.05% వాటా ఉంది. వాటాదారులకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10Cr షేర్లను ₹1,800 చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది.(కంపెనీ తన సొంత షేర్లను బహిరంగ మార్కెట్/వాటాదారుల నుంచి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు)

News November 6, 2025

సచివాలయాలకు అందరికీ ఆమోదయోగ్యమైన పేరే: మంత్రి డోలా

image

AP: ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుందని మంత్రి విమర్శించారు.