News October 24, 2024
అవినాశ్ రెడ్డిని విమర్శిస్తున్నారని కేసు పెట్టడం ఏంటి జగన్?: TDP

AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్‌మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్‌ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.
Similar News
News February 1, 2026
డ్యూటీలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన

TG: నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ <<19017490>>సౌమ్య<<>> మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
News February 1, 2026
కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/
News February 1, 2026
40% GST.. భారీగా పెరిగిన ధరలు

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.


