News October 24, 2024

‘న్యాయదేవత’ మార్పునకు కారణాలేంటో తెలీదు: SC బార్ అసోసియేషన్

image

సుప్రీంకోర్టులో విప్లవాత్మక మార్పులను కపిల్ సిబల్ నేతృత్వంలోని బార్ అసోసియేషన్ ప్రశ్నించింది. కొత్త ఎంబ్లెమ్, న్యాయదేవత మార్పులపై తమను సంప్రదించలేదని పేర్కొంది. మ్యూజియం ప్రతిపాదించిన స్థలంలో లాయర్లకు కెఫేను నిర్మించాలని డిమాండ్ చేసింది. తాము వ్యతిరేకిస్తున్నా మ్యూజియం పనులు మొదలవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ పరిపాలనలో తామూ సమాన హక్కుదారులమని, మార్పులు తమ దృష్టికి తీసుకురాలేదని తెలిపింది.

Similar News

News March 17, 2025

ఫస్ట్ మ్యాచ్.. RCB తుది జట్టు ఇదేనా?

image

IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ (C), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, బెథెల్/టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్‌వుడ్, సుయాశ్.

News March 17, 2025

నటి రన్యారావుపై బీజేపీ MLA అసభ్య వ్యాఖ్యలు

image

బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన <<15652905>>నటి రన్యా రావుపై<<>> బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరంలోని అంగాంగంలో ప్రతీ చోట బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేసిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మంత్రుల పేర్లను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడిస్తానని చెప్పారు. ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందన్నారు.

News March 17, 2025

ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే: సీఎం చంద్రబాబు

image

AP: 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల GDPకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత MLAలదే. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం’ అని తెలిపారు.

error: Content is protected !!