News October 24, 2024

నమ్ముకున్న పార్టీయే నన్ను అవమానిస్తోంది: జీవన్‌రెడ్డి

image

TG: నమ్ముకున్న పార్టీయే తనను అవమానిస్తోందంటూ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై పార్టీనే మార్గదర్శకం చేయాలన్నారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్‌లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News December 26, 2025

ATS విధానం అమలులోకి తేవాలి: అమిత్ షా

image

ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్‌లో 40KGల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 3టన్నుల పేలుడు పదార్థాలను డిటోనేట్ కాకముందే స్వాధీనం చేసుకున్నామని యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2025లో తెలిపారు. పోలీసులకు అవసరమైన కామన్ ATS విధానాన్ని త్వరలో అమలులోకి తేవాలని డీజీపీలను కోరారు. అందరూ తెలుసుకోవాలి అనే విధానంతో కాకుండా అందరికీ తెలియజేయాలి అనే ప్రిన్సిపల్‌తో ముందుకు సాగాలన్నారు.

News December 26, 2025

మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

image

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.

News December 26, 2025

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.