News October 24, 2024
శ్రీశైలం డ్యాం మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యామ్ మూడు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 84,087 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఒక్క గేటు ద్వారా నీటి విడుదల ప్రారంభించిన అధికారులు 10 గంటల తర్వాత మరో 2 గేట్లను ఎత్తివేశారు. కాగా బ్యాక్ వాటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్కు 1,519 c/s, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600c/s, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 23,250c/s నీటిని విడుదల చేశారు.
Similar News
News November 7, 2025
విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

ఆటోలు కళాశాలల స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టంచేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, రోడ్ల వెంట ఆటోలను నిలపడం, మద్యం తాగి వాహనాలు నడిపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News November 6, 2025
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సిద్ధం కావాలి: చీఫ్ ఎలక్టోరల్ అధికారి

కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా లోపరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి, అధికారులు పాల్గొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. డూప్లికెట్, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
News November 5, 2025
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


