News October 24, 2024

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు పంట నష్టం: జడ్పీ ఛైర్పర్శన్

image

అల్లూరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగిందని విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో ‌జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో పంట నష్టం మంజూరుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన కలెక్టర్లు హరీంద్ర ప్రసాద్, విజయ్ కృష్ణన్, దినేశ్ కుమార్ పాల్గొన్నారు.

Similar News

News January 2, 2026

విశాఖ జిల్లాలో 1,232 టన్నుల ఎరువులు సిద్ధం

image

విశాఖపట్నం జిల్లాలో రబీ సాగుకు అవసరమైన ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వి. ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 6,532 హెక్టార్లలో పంటలు సాగు కాగా, జనవరి చివరి వరకు సరిపడేలా 1,232 టన్నుల ఎరువులు (722 టన్నుల యూరియా సహా) సిద్ధంగా ఉన్నాయన్నారు. మార్క్‌ఫెడ్, రైతు సేవా కేంద్రాల వద్ద నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

News January 2, 2026

జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

image

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.

News January 2, 2026

విశాఖలో రెండు రోజుల పాటు తెలంగాణ గవర్నర్ పర్యటన

image

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రెండు రోజుల విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం తూర్పు నావికా దళం (ENC) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాత్రి 8.35 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.