News October 24, 2024

సొంత బాబాయ్‌నే జగన్ చంపించేశాడు: హోంమంత్రి అనిత

image

సీఎం కుర్చీలో కూర్చోడానికి సొంత బాబాయ్‌ని వైఎస్ జగన్ చంపించేశాడని హోంమంత్రి అనిత ఆరోపించారు. తల్లీ, చెల్లి మీద ఏదోరోజు కేసు పెడతారనుకున్నాం.. అలానే కేసు పెట్టారని ఆమె అన్నారు. బాబాయ్ మృతి విషయంలో సీఐడీ పేరుతో చెల్లిని కామ్ అప్ చేశారని ఎద్దేవా చేశారు. అన్న కోసం ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన షర్మిళ.. ఎన్నికల ముందు ఎదురుతిరిగిందన్న ఆమె.. జగన్ నిజస్వరూపం ఏంటో వాసిరెడ్డి పద్మ చెప్పారని అన్నారు.

Similar News

News July 7, 2025

విశాఖ: ’10 వేల మంది మార్గ‌ద‌ర్శుల‌ను గుర్తించాలి’

image

పీ-4 విధానానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చి ప‌ని చేయాల‌ని, జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాల అవ‌స‌రాల‌ను తెలుసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్షరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలను ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకు వ‌చ్చే మార్గ‌ద‌ర్శుల‌ను వారం రోజుల్లో గుర్తించాల‌ని ఆదేశించారు. స‌చివాల‌యం ప‌రిధిలో 50 బంగారు కుటుంబాల అవస‌రాల‌ను గుర్తించాలన్నారు.

News July 7, 2025

విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

image

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.

News July 7, 2025

విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

image

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.