News October 24, 2024
గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా

AP: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.
Similar News
News January 12, 2026
శాస్త్రం చూసి మరీ కోడి పందేలు.. ఎందుకంటే?

గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ పందెంలో గెలవడానికి పుంజుకి సత్తా ఉంటే సరిపోదట, గ్రహాలు కూడా అనుకూలించాలట. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఓ గ్రంథమే అందుబాటులో ఉంది. అదే ‘కుక్కుట శాస్త్రం’. పందెం రాయుళ్లు కోడి పందేల సమయంలో ఈ గ్రంథంపైనే ఆధారపడతారట. అసలు ఈ గ్రంథంలో ఏముంటుంది? పందెం కోళ్ల విజయాలపై ఈ గ్రంథం ఏం చెబుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 12, 2026
DRDO-SSPLలో ఇంటర్న్‌షిప్.. అప్లై చేశారా?

<
News January 12, 2026
కుక్కుట శాస్త్రంలో ఏముంటుంది?

మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో ‘కుక్కుట’ అంటారు. వీటి పంచాంగానికి ‘కుక్కుట శాస్త్రం’ అని పేరు. దీని ప్రకారం తిథి, వార, నక్షత్రాలు.. కోళ్ల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతాయని పందెం రాయుళ్లు నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో 27 నక్షత్రాలుంటాయి. ఇవి కోడిపుంజుల రకాలను బట్టి ప్రభావం చూపుతాయట. ఏ వారంలో ఏ కోడి గెలుస్తుంది? ఏ ఘడియ, ఏ నక్షత్రంలో దానిని బరిలో దింపాలనేది ఈ శాస్త్రంలో ఉందట.


