News October 24, 2024
బెంగళూరు నుంచి ఏపీకి వచ్చేయండి: నారా లోకేశ్

బెంగళూరులో డ్రైనేజీ, ట్రాఫిక్ ఐటీ కంపెనీల విస్తరణకు ఆటంకాలుగా మారాయని పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్ చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేశ్ స్పందించారు. బెంగళూరును వదిలి APకి రావాలని, పెట్టుబడులు పెట్టే వారి కోసం 6 పాలసీలు సిద్ధం చేశామని తెలిపారు. ‘జగన్ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు కంపెనీలు స్థాపించేందుకు భయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా, ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది’ అని మోహన్ అన్నారు.
Similar News
News February 17, 2026
650 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

RBIలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. మార్చి 8 వరకు <
News February 17, 2026
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News February 17, 2026
వేరుశనగలో తెగుళ్ల కట్టడికి మరికొన్ని సూచనలు

వేరుశనగలో పంట చుట్టూ లేదా పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కంచె పంటగా సజ్జ లేదా జొన్నలను 3-4 వరుసలలో వేసుకోవాలి. వేరుశనగ పంటలో పసుపు, నీలం జిరుగు అట్టలను ఎకరాకు 10 నుంచి 15 చొప్పున పొలంలో అమర్చుకోవాలి. వేరుశనగ పంటలు ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువును వేసుకోవాలి. ఈ జాగ్రత్తలతో ఆకుమచ్చ తెగులుతో పాటు ఇతర చీడపీడల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


